BDK: దమ్మపేట మండలం గండుగులపల్లిలో గల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ CMRF చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. మొత్తం 34 మంది లబ్ధిదారులకు రూ. 10.56 లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమాదేవి రాంబాబు పాల్గొన్నారు.