AP: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథాలు’ కార్యక్రమం కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వ్యర్థాలను క్రమం తప్పకుండా సేకరించి రీసైకిల్ చేస్తున్నట్లు చెప్పారు. కాలుష్యాన్ని నియంత్రిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే లక్ష్యమని.. ఇటీవల ఒక్కరోజులోనే లక్ష కేజీల చెత్తను స్వచ్ఛ సారథులు సేకరించినట్లు వెల్లడించారు.