TG: తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం పోరాడి అమరత్వం పొందిన వీరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. ఆయన జయంతి, వర్థంతులను కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి గౌరవించుకుందన్నారు. దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు.