ADB: సిరికొండ పోలీస్ స్టేషన్కు చెందిన 1993 బ్యాచ్ కానిస్టేబుల్ యేగడే మదన్ హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి పొందారు. ఈయనను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ కార్యాలయంలో పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. పదోన్నతితో బాధ్యతలు పెరుగుతాయని, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. పోలీసు విధులలో నీతి, నిజాయితీ తప్పనిసరి అని పేర్కొన్నారు.