TG: వరంగల్, హనుమకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ అధికారుల సోదాల్లో సబ్ రిజిస్ట్రార్ల అవినీతి బట్టబయలైనట్లు తెలుస్తోంది. లంచం ఇవ్వలేదని డాక్యుమెంట్లు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడ్డారని, తనిఖీల్లో 204 అక్రమ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాపర్టీ విలువ ఆధారంగా లంచం డిమాండ్ చేసినట్లు గుర్తించారు.