VSP: ఎలమంచిలి (M) పోతిరెడ్డిపాలెం జంక్షన్ NH-16పై గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురు ప్రయాణిస్తున్న బైకును అనకాపల్లి నుంచి తునివైపు వెళుతున్న ప్రైవేటు బస్సు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో పురుషోత్తపురానికి చెందిన బంగారు నాని (24), ఈలప గోవిందు (25), బంగారు దుర్గాప్రసాద్(16) తీవ్రంగా గాయపడ్డారు.