BPT: పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంకు చెందిన నూర్ భాషా బీబులు అందరికీ ఆదర్శం. ఒకప్పుడు కూలీగా చేసిన ఆమె.. ఓ బ్యూటీ పార్లర్లో పనికి చేరారు. PMEGP ద్వారా రూ.5 లక్షలు, సంఘం, స్త్రీనిధి ద్వారా మరో రూ.2 లక్షల రుణం పొందారు. ఆ డబ్బుతో తాను పనిచేసిన షాపును కొనుగోలు చేసి ఓనర్‌గా మారారు. ఇప్పుడు నెలకు రూ.20 వేలు సంపాదిస్తూ ఆర్థికంగా ఆదర్శంగా నిలుస్తున్నారు.