పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో పలు హోటళ్లు మళ్లీ కర్రల పొయ్యలను వినియోగిస్తున్నాయి. దీంతో వ్యాపారులకు అదనపు భారమవుతుండగా, వంటప్రక్రియ కూడా ఆలస్యమవుతోంది. అధికారులు త్వరగా గ్యాస్ సరఫరా మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు.