TPT: తిరుపతి జిల్లా పాకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 9న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ప్రముఖ కంపెనీలు సుమారు 860 ఉద్యోగాల భర్తీకి పాల్గొననున్నాయని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.