కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 970 గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ముగిసింది. నేటి నుంచి ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించి, కొత్త పాలక వర్గాలు ఏర్పాటయ్యే వరకు వీరే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అభివృద్ధి పనులు, పరిపాలనలో జాప్యం కలగకుండా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.