NZB: పల్లెలు, పట్టణాల సమగ్ర అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజల చొరవ ఉన్నప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని, గ్రామ సమస్యల పరిష్కారానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆమె సూచించారు.