KMR: దోమకొండ మండలంలోని పెస్టిసైడ్ దుకాణాల్లో మండల వ్యవసాయ అధికారిణి మణిదీపిక నిన్న తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం గడ్డి మందును రెండు నెలల పాటు నిషేధించినందున వ్యాపారులు రైతులకు విక్రయించవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు.