భరతమాత వీరపుత్రుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి నేడు. మొఘలుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆయన.. ‘హిందవీ స్వరాజ్యం’ కోసం తుది వరకు పోరాడారు. 1680 ఏప్రిల్ 3న రాయగఢ్ కోటలో శివాజీ మరణించినా.. ఆయన ధైర్యం, పరిపాలనా దక్షత తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. అన్యాయాన్ని ఎదిరించి, ధర్మాన్ని నిలబెట్టిన ఆ మహనీయుని వీరత్వాన్ని యావత్ భారతావని స్మరించుకుంటోంది.