ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల్లో చిటికెన నేతాజీపై 26 ఓట్ల తేడాతో జాయింట్ సెక్రటరీగా వింజమూరు కిరణ్ కిషోర్ గెలుపొందారు. కిషోర్ గెలుపు పట్ల బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ కోసం, సభ్యుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కిరణ్ కిషోర్ అన్నారు.