Penny Wong: స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా మంత్రి పెన్నీ
ఆస్ట్రేలియా పార్లమెంటులో తొలి లెస్బియన్ ఎంపీగా ఉన్న పెన్నీ వాంగ్ తాజాగా పెళ్లి చేసుకుంది. సోఫియా అల్లౌకేతో గత 20 ఏళ్లుగా సహజీవనం చేస్తూ తాజాగా వివాహం చేసుకున్నారు.
Penny Wong: ఆస్ట్రేలియా(Australian) పార్లమెంటులో తొలి లెస్బియన్ ఎంపీగా ఉన్న పెన్నీ వాంగ్(Penny Wong) తాజాగా పెళ్లి చేసుకుంది. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తన భాగస్వామి సోఫియా అల్లౌకే(Sophia Allouke)ను వివాహంతో ఒకటయ్యారు. ఆస్ట్రేలియా క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న తొలి ఆసియా సంతతి మహిళగా పెన్నీ వాంగ్ తాజా నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. గత 20 ఏళ్లుగా సోఫియా, పెన్నీ వాంగ్ సహజీవనం చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలో స్వలింగ వివాహాలకు చట్టపరమైన అనుమతి ఉంది. 2017 నుంచి ఇక్కడ స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశారు. ఆ చట్టాన్ని ఉపయోగించుకొని వీరు పెళ్లి చేసుకున్నారు. అడిలైడ్ నగరంలో వీరు మ్యారెజ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని పెన్నీ వాంగ్ స్వయంగా వెల్లడించారు. సన్నిహితులు, మా సామాజిక వర్గీయులతో కలిసి ఈ స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.