ELR: అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన సందర్భంగా పెదవేగి మండలం పెదకడిమిలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి గ్రామస్థులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.