W.G: ఆకివీడు పెదపేట ఆలయ వివాదంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో డీఆర్వో శివన్నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి, పరిస్థితులు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.