NTR: నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో అమరావతి రాజధాని బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఎంపీడీవో ఆర్.వి.ఎస్. ప్రసాదరావు ఆధ్వర్యంలో “మన రాజధాని-మన అమరావతి” నినాదాలతో దీపాలు వెలిగించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో, ఎంపీపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.