తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా పేరొందిన కాజల్ అగర్వాల్ లక్ష్మికళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.పెళ్లి తరవాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కాగా సీని నటి కాజల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన కొడుకుతో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని కాజల్ ప్రేమించి పెళ్లాడింది.. వీరికి 2022లో కొడుకు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత కాజల్ తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. కుటుంబసభ్యులతో తిరుమల వేంకటేశ్వరస్వామికి కాజల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన నటి కాజల్ అగర్వాల్‌ను చూసి అభిమానులు అభివాదం చేశారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 లో నటిస్తుంది కాజల్.