NZB: హనుమాన్ శోభాయాత్రను శాంతి యుతంగా నిర్వహించేందుకు 1,300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు NZB CP సాయి చైతన్య తెలిపారు. అలాగే CC, డ్రోన్ కెమెరాలు, బైనాక్యులర్లతో 24/7 పటిష్ఠమైన నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. NZBతో పాటు ఖమ్మం, రాజన్న సిరిసిల్ల , భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి పోలీస్ సిబ్బందిని రప్పించామన్నారు.