KKD: పిఠాపురం పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ కుంతీ మాధవ స్వామి ఆలయ కోనేరులో మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. మృతుడిని అదే ప్రాంతానికి చెందిన జోగా కృష్ణ(55)గా స్థానికులు గుర్తించారు. కోనేరులో విగతజీవిగా పడి ఉన్న కృష్ణను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆయన మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి వుంది