SKLM: వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బొంతల కోడూరులోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల గదులను పరిశీలించిన ఆయన, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వార్డెన్‌కి సూచించారు