తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదని రాజ్యసభలో ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, NTPCని కూడా ఇవ్వలేదన్నారు. రాజకీయాల అవసరానికి ఏపీకి విభజన హామీలు అమలు చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. పంచగ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని, టీజీలో ఉండాలని కోరుకుంటున్నా వాళ్లను ఏపీలో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలను అవమానిస్తుందన్నారు.