BHNG: సమాజంలోని అన్యాయాలపై ధైర్యంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే సామేలు అన్నారు. గురువారం మోత్కూరులో పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం పాపన్న చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు.