AP: పార్లమెంట్‌కు రాష్ట్ర రాజధాని కోసం బిల్లు రావడం అమరావతి రైతుల విజయమేనని కాంగ్రెస్ MP రేణుకా చౌదరి పేర్కొన్నారు. అమరావతి ఉద్యమంలో మహిళలు, రైతులను గత ప్రభుత్వం వేధించిందని.. 3 రాజధానులంటూ రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిందని విమర్శించారు. అలాగే రాష్ట్ర విభజన హామీలను కేంద్రం మరిచిందని, త్వరితగతిన అమలు చేయాలని డిమాండ్ చేశారు.