JN: బచ్చన్నపేట మండలం కట్కూరు-చేర్యాల గ్రామ శివారులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న బాలయ్యకు తీవ్ర గాయాలు కాగా, అతని మనవరాలు కీర్తన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.