కర్నూలు: ఆదోని సబ్‌డివిజన్ శక్తి టీంకు వచ్చిన సమాచారంతో దిబ్బనకల్లు గ్రామంలో జరగనున్న బాల్య వివాహాన్ని బుధవారం అడ్డుకున్నారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో వివాహాన్ని రద్దు చేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు, వీఆర్ఓ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.