SRPT: కోదాడలోని రంగా థియేటర్ సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ అలంకారప్రాయంగా మారాయి. నిత్యం మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు రాకపోకలు సాగించే ఈ కూడలిలో సిగ్నల్ వ్యవస్థ మూలన పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లేక గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. అధికారులు స్పందించి సిగ్నల్స్ పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు.