W.G: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెల్లో అభివృద్ధి పండగ నెలకొందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం తేతలి, లక్ష్మీనారాయణపురంలో పలు అభివృద్ధి పనుల్లో ఆయన పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఇప్పటి వరకు రూ.450 కోట్లతో పనులు జరిగాయని వివరించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.