EG: రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి జేగురుపాడు సర్పంచ్, న్యాయవాది యాదల సతీశ్ చంద్ర స్టాలిన్ భారీ విరాళం ప్రకటించారు. న్యాయవాదులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో బుధవారం రూ.1,11,111 చెక్కును బిల్డింగ్ కమిటీకి అందజేశారు. సతీశ్ చంద్ర స్టాలిన్ ఉదారతను పలువురు న్యాయవాదులు, ప్రముఖులు అభినందించారు.