సత్యసాయి: పుట్టపర్తిలో జరిగిన DRC సమావేశంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల వేగవంతంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లెడుబండ భూసేకరణ పూర్తి చేసి, హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను పీఏబీఆర్ కాలువతో అనుసంధానం చేయాలని సూచించారు. మైక్రో ఇరిగేషన్ నిధులు రూ.50 కోట్లు పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు.