VKB: కొడంగల్ మండలంలో రేషన్ దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. వేసవి ఎండల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో బుధవారం రేషన్ షాపుల వద్ద భారీగా జనం గుమిగూడారు. అధికారులు క్యూ లైన్లు పాటించాలని సూచించినా, జనం ఎగబడటంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.