SRD: కంగ్టి మండలంలో హనుమాన్ జయంతి, పౌర్ణమి వేడుకలు గురువారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు స్వామివారికి సింధూర లేపనంతో అభిషేకం పూజలు నిర్వహించారు. మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.