విజయవాడ నుంచి HYDకు కొత్తగా మరో 2 విమానాలు అందుబాటులోకి రానున్నట్లు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఫ్లై-91 ఎయిర్లైన్స్ సంస్థ ఈ సర్వీసులను నడపనుంది. మొదటి సర్వీసు ఈనెల 10వ తేదీ నుంచి, రెండో సర్వీసు ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ కొత్త సర్వీసుల్లో ప్రయాణ ఛార్జీలు రూ.4 వేల నుంచి రూ.8 వేల మధ్య ఉంటాయని పేర్కొన్నారు.