GDWL: దేశంలోని అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థల్లో శిక్షణ పొంది తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలి అని గద్వాల జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.రామలింగేశ్వర గౌడ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ పథకం మూడో దశ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు వెల్లడించారు.