NZB: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ధర్పల్లి మండల కేంద్రంలోని వైన్స్‌ను 24 గంటల పాటు మూసి వేయాలని ఎస్సై ఎస్. శ్రీనివాస్ సూచించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్‌లను మూసి ఉంచాలన్నారు. మండలంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించే సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.