W.G: జిల్లాలో గృహ నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ నాగరాణి నిన్న భీమవరం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో ఆమె మాట్లాడుతూ.. పనుల్లో వేగం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.