SRPT: భూమిలేని వ్యవసాయ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపల్లి సైదులు డిమాండ్ చేశారు. బుధవారం నాగారంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఏడాదికి రూ.12వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి నేటికీ అమలు చేయడం లేదన్నారు.