ASR: వీఆర్.పురం మండలం వడ్డీగూడెం-ఏడుగురాళ్లపల్లి గ్రామాల మధ్య హైవేపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. భద్రాచలం వైపు నుంచి చింతూరుకు బైక్పై వెళుతుండగా మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన పడ్డాడని స్థానికులు తెలిపారు. 108 వాహనం సకాలంలో రాకపోవడంతో ఆటోలో అతడిని ఏడుగురాళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు.