KMM: పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రభుత్వ లెక్చరర్ సిహెచ్ రవికుమార్ అన్నారు. బుధవారం మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్ అచీవ్మెంట్ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులు, మోడల్స్, సైన్స్ ఎగ్జిబిషన్స్, సృజనాత్మక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.