MDCL: అల్వాల్, కానాజీగూడలోని మరకత శ్రీలక్ష్మీ గణపతి దేవస్థానంలో ఏప్రిల్ 5 నుంచి 7 వరకు 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక హోమాల్లో పాల్గొనే భక్తులకు మరకత గణపతి లాకెట్‌ను మహాప్రసాదంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.