MLG: వెంకటాపూర్ మండలంలోని రామానుజాపురం గ్రామంలో నూతన మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ భగవాన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.