నెల్లూరులో విషాద ఘటన జరిగింది. నగరంలోని నాలుగో మైలుకు చెందిన హర్షిత(22) బీటెక్ చదువుతోంది. తండ్రితో కలిసి బైక్పై మైపాడు గేట్ నుంచి ఇంటికి బయల్దేరిన సమయంలో కిసాన్ నగర్ వద్దకు రాగానే బైక్ అదుపు తప్పింది. అదే సమయంలో లారీ రావడంతో హర్షిత వాటి చక్రాల కిందపడి అక్కడికక్కడే చనిపోయింది. తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.