SDPT: ఆపదలో ఆదుకొనే సంఘమే సమాజానికి ఆదర్శమని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పేద మహిళల జీవనోపాధి కోసం తన సొంత నిధులతో మరో 50 కుట్టు మిషన్లను బుధవారం అందజేశారు. గతంలో ఇచ్చిన 50 మిషన్లతో కలిపి మొత్తం 100 పూర్తి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలీలకు అందాల్సిన ప్రభుత్వ పథకాలన్నింటినీ నిలిపివేసిందని ఆయన మండిపడ్డారు.