BPT: వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు బూతుమల్లి గ్రామం (SC కాలనీ)లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిజమైన అర్హుల గడపదాకా చేరుస్తోందని పేర్కొన్నారు.