MNCL: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. బుధవారం దండేపల్లి మండలంలోని నెల్కీ వెంకటాపూర్, కొండాపూర్, ధర్మారావుపేట్, నాగసముద్రం గ్రామాలలో నేలకొరిగిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టపోయిన పంటలకు వెంటనే ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలన్నారు.