TG: BCCI నేషనల్ క్యాంప్‌కు సెలక్ట్ అయిన యువ క్రికెటర్ హిమతేజను MLC మల్క కొమురయ్య సన్మానించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకుడు ఈ ఘనత సాధించడం గర్వకారణమన్నారు. భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో తెలంగాణ పేరును జాతీయస్థాయికి తీసుకెళ్లే అవకాశం తనకు రావడం గర్వంగా ఉందని హిమతేజ తెలిపారు.