కృష్ణా: నాగాయలంక మండలం రేమాలవారిపాలెంలో నూతన డ్రైనేజీని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం ప్రారంభించారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ నిధులు రూ. 22.50 లక్షలతో 470 మీటర్లు పొడవైన సిమెంట్ కాంక్రీట్ డ్రైనేజీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలోనే స్థానిక సంస్థలకు గౌరవం, ప్రజా ప్రతినిధులకు విలువ, నిధులు సక్రమంగా వచ్చాయన్నారు.