KDP: పొద్దుటూరులోని పాత బస్టాండ్‌ను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పరిశీలించి, ఆవరణలోని, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. బస్టాండ్ లోపల పాత టైర్ల వ్యాపారం పేరుతో కొందరు పూర్తిగా ఆక్రమించడంతో ముందు వైపున దారి ఇరుకుగా మారిందని, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.