రైలు టికెట్ రద్దు నిబంధనలు మారాయి. ఇకపై టికెట్లను ప్రయాణానికి 8 నుండి 24 గంటల మధ్య రద్దు చేస్తే సగం డబ్బులే వస్తాయి. అదే 72 గంటల లోపు రద్దు చేస్తే 75 శాతం రిఫండ్ ఇస్తారు. అంతకంటే ముందే రద్దు చేసుకుంటే కేవలం సాధారణ ఛార్జీలే వర్తిస్తాయి. అయితే 8 గంటల లోపు రద్దు చేస్తే మాత్రం రిఫండ్ రాదు.